బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ కోణం వెలుగులోనికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ అందించడంలో కీలకంగా ఉన్న కరమ్‌జీత్ సింగ్ ఆనంద్‌ను ఎన్సీబీ అరెస్టు చేసింది.
తాజాగా అతడికి బెయిల్ మంజూరైంది. వ్యక్తిగత పూచీకత్తుపై ముంబై న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. తమకు సమాచారం లేకుండా దేశం దాటి బయటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ స్నేహితురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, సుశాంత్ పనివాళ్లను కొందరిని గతంలో ఎన్సీబీ అరెస్టు చేసింది. వారిలో చాలామంది ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.
Spread the love