జనసేనని వీడిన కరణం

జనసేన పార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. ఇటీవలే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా విశాఖపట్నానికి చెందిన మరో నాయకుడు జనసేనకు గుడ్‌బై చెప్పారు. గాజువాక సీనియర్‌ నాయకుడు కరణం కనకారావు బుధవారం జనసేన పార్టీకి రాజీనామా చేశారు.

ఆ వెంటనే వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కనకారావును పార్టీ కండువాతో సాదరంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆహ్వానించారు. కనకారావుతో పాటు 200 మంది జనసైనికులు కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.