కోలీవుడ్ హీరో ధనుష్.. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరో వైపు ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి ధనుశ్ ఓ డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాయే ‘కర్ణన్’. ప్రముఖ నిర్మాత కలైపులి థాను నిర్మిస్తోంది.
ఈ చిత్రాన్ని మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్4న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. విడుదల తేదిని తెలియజేస్తూ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో సంకెళ్లతో బంధించిన ధనుశ్ కనిపిస్తున్నాడు. వాలంటైన్ డే గిఫ్ట్ గా కర్జన్ ఫస్ట్ లుక్, రిలీజ్ డేటుని చెప్పేశారు.
Spread the love