క‌ర్నాట‌క‌ బంద్ ఉద్రిక్తం 

నేటి కర్నాటక బంద్ ఉద్రిక్త పరిస్థితులకి దారితీసింది. కర్నాటకలో స‌రోజ‌ని మ‌హిషి నివేదిక‌ను అమ‌లు చేయాల‌నే డిమాండ్ బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. స‌రోజ‌ని మ‌హిషి నివేదిక‌ అంటే.. ? స్థానిక క‌న్న‌డీయుల‌కు ఉద్యోగాల్లో కోటా క‌ల్పించాల‌ని ప‌లు సంఘాలు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాయి. ప్రైవేటు, ప‌బ్లిక్ సెక్టార్ కంపెనీల్లో ఆ కోటా ఉండాల‌ని క‌న్న‌డ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

బంద్ నేప‌థ్యంలో.. ఫరంగిపేట వ‌ద్ద ఓ బ‌స్సుపై రాళ్లు రువ్వారు. తిరుప‌తి నుంచి మంగుళూరు వెళ్తున్న బ‌స్సు ఆ దాడిలో ధ్వంస‌మైంది. క‌న్న‌డ ఐక్య కూట‌మి ఆధ్వ‌ర్యంలో బంద్ కొన‌సాగుతున్న‌ది. బెంగుళూర్‌తో పాటు రాష్ట్రంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో జ‌న‌జీవ‌నం స్తంభించింది. ఇక బంద్ నేప‌థ్యంలో బెంగుళూరు వ‌ర్సిటీ పీజీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను మార్చింది. నిర‌స‌న‌కారుల‌తో చ‌ర్చ‌లు చేప‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని క‌ర్నాట‌క సీఎం బీఎస్ య‌డ్యూర‌ప్ప తెలిపారు.