తిరుమల బ్రహ్మోత్సవాలకు కర్ణాటక సీఎం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం  జగన్‌మోహన్‌రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప హాజరుకానున్నారు. రెండు రోజులు పాటు తిరుమలలోనే సీఎం వైఎస్‌ జగన్ ఉండనున్నారు.

23వ తేది సాయంత్రం తిరుమలకు సీఎం చేరుకోనున్నారు. గరుడ సేవ సందర్భంగా 23 సాయంత్రం శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. 24న ఉదయం శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ దర్శించుకోనున్నారు. దర్శనాంతరం నాదనీరాజనం మండపంలో నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశాలున్నాయి.