జులై 5 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

దేశంలో కరోనా విజృంభిస్తున్న మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పలు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం జులై 5 నుంచి మరోసారి కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ నిబంధనల్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.

జూలై 5వ తేదీన పదో తరగతి పరీక్షలు ముగియగానే.. కట్టుదిట్టమైన నిబంధనలతో లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ప్రణాళిక రచించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప నేతృత్వంలో శనివారం సాయంత్రం ప్రత్యేక సమావేశంలో చర్చించారు. రోజురోజూకు కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వారంతపు సెలవుల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.