కవిత గ్రేటర్ సందేశం

గ్రేటర్ లో మరోసారి గులభి జెండాని ఎగరవేయాలని ఆశపడుతోంది. ఈ దఫా అభివృద్ధి మంత్రంతో దూసుకెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు గ్రేటర్ లో అభివృద్ది మంత్రాన్ని జపిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా గ్రేటర్ లో తనవంతు ప్రచారాన్ని మొదలెట్టింది. వీడియో సందేశాలని వదిలుతోంది.

తాజాగా ఎమ్మెల్సీ కవిత మరో కీలక సందేశాన్ని విడుదల చేశారు. ఆరేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అమలు చేసిందని… హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతోందని చెప్పారు. వరుసగా ఐదేళ్లుగా దేశంలోనే ఉత్తమ నగరంగా హైదరబాద్‌ ఉందని పేర్కొన్నారు. మహా నగరంలో రోడ్లు, ఫ్లై ఓవర్లు, శాంతి భద్రతలు, 24 గంటల కరెంటు, పార్కులు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే పరిస్థితులు ఇవన్నీ సీఎం కేసీఆర్‌ నాయకత్వం, కేటీఆర్‌ పర్యవేక్షణతోనే సాధ్యమయ్యాయని కొనియడారు. అభివృద్ధి కొనసాగించేందుకు వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.