ప్రగతి భవన్లో కేసీఆర్ కి హీరో నితిన్ రూ. 10 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నితిన్‌ను కేసీఆర్ అభినందించి ఆయన్ని ఆప్యాయంగా కౌగలించుకున్నారు. నితిన్ సేవా దృక్పథాన్ని ప్రశంసించారు. ప్రస్తుతం లాక్డౌన్ అమలులో ఉన్నందున వీలైనంత త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలుసుకొని, ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి తాను ప్రకటించిన రూ. 10 లక్షలను అందజేస్తానని నితిన్ తెలిపారు.
ఇదీలావంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, నిత్యావసర వస్తువులను కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న సభ్యులకు అండగా నిలవాలని తెలుగు దర్శకుల సంఘం నిర్ణయించుకున్నట్టు ఆ సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్ తెలిపారు. ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్న వారి వివరాలను సేకరిస్తున్నామని, ఏప్రిల్ మొదటి వారం నుండే ఈ సేవలు అందిస్తామని చెప్పారు.
Spread the love