కేసీఆర్ గ్రేటర్ ప్రచారం ఏర్పాట్లు పూర్తి

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. నేతల మాటలు కోటలు దాటుతున్నాయ్. ఒకరిపై మరొకరు ఓ రేంజ్ లో ఆరోపణలు చేసుకుంటున్నారు. సవాళ్లు విసురుకుంటున్నారు. మరో మూడు రోజులే గడువుండటంతో అధికార ప్రతిపక్షాలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. విమర్శలు, ప్రతివిమర్శలకు పదును పెడుతున్నాయి.

భాజపా అభ్యర్థుల తరఫున ప్రచారానికి కేంద్రమంత్రులు వస్తున్న నేపథ్యంలో అధికార మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.ఈ క్రమంలో తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఈ నెల 28న ఎల్బీస్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను తెరాస నేతలు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాసయాదవ్‌ తదితరు ఏర్పాట్లని పరిశీలించారు. ఏర్పాట్లు పూర్తి కావొస్తున్నాయని తెలిపారు.

Spread the love