వాళ్లకి కేసీఆర్ సీరియస్ వార్నింగ్

”కూరగాయల ధరలు పెంచినట్టు వార్తల్లో చూశాను. ధరలు పెంచుతామంటే ఊరుకోం. ఎవరైతే ఎక్కువ ధరలకు అమ్ముతారో వారిపై పీడీ యాక్టు ప్రయోగిస్తాం ”అని సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కూరగాయలు, నిత్యావసర ధరలు పెంచిన వ్యాపారులపై ఆయన సీరియస్ అయ్యారు.

అధికంగా ధరలు పెంచి ఈ సమయంలో ప్రజల రక్తం పిండుకోవాలని ప్రయత్నిస్తే లైసెన్సులు రద్దు చేస్తాం. దుకాణాలను సీజ్‌ చేస్తాం. పీడీ యాక్టులు పెట్టి జైళ్లకు కూడా పంపిస్తాం. తస్మాత్‌ జాగ్రత్త. మీ జీవితాలు పాడుచేసుకోవద్దు. మీ వ్యాపారాలు దెబ్బతీసుకోవద్దు. బ్లాక్‌లిస్ట్‌లో పెడతాం.. ఎంత ఏడ్చినా లైసెన్సులు రావు. ప్రపంచమంతా అల్లకల్లోలం నెలకొంటే ప్రజల జేబులు కొల్లగట్టేలా వ్యవహరించడం పద్ధతి కాదు.’’ అని చెప్పుకొచ్చారు కేసీఆర్‌.