జీహెచ్ఎంసీ కి కేసీఆర్ వార్నింగ్

జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉన్నారని, వారందరూ ఏమయ్యారని సూటిగా ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ప్రజాప్రతినిధులుగా మీకు బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు. నూటికినూరు శాతం మీరు రంగంలోకి దిగాల్సిందే అని స్పష్టం చేశారు. తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రజా నియంత్రణ చర్యల్లో కేవలం పోలీసులు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారని, ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా కనిపించడంలేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

హైదరాబాద్ విషయానికొస్తే మూడు పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయని, సిటీ, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని అందరు శాసనసభ్యులు అందరూ దయచేసి ప్రజానియంత్రణ చర్యల్లో పాలుపంచుకోవాలని కోరారు. సిగ్నళ్లు, కూడళ్ల వద్ద నిలుచుని లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా చూడాలని అన్నారు.