కిమ్ షాకింగ్ డిసిషన్

కొట్లాటకు కాలు దువ్వే కోడె దూడ వెనకడుగు వేసినట్టు.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కాస్త దూకుడు తగ్గించాడు. దక్షిణ కొరియాపై సైనిక చర్యలేమీ వద్దని ఆదేశాలు జారీ చేశారు. 1950 లో జరిగిన కొరియా యుద్ధం తరువాత రెండు దేశాలుగా విడిపోయాయి. దక్షిణ కొరియా అభివృద్ధి పధంలో ముందుకు సాగితే, ఉత్తర కొరియా మాత్రం నియంత పాలనలో కొనసాగుతున్నది.

కొరియా యుద్ధం జరిగి 70 ఏళ్ళు పూర్తైంది, 70 ఏళ్ల వార్షికోత్సవాలు తరువాత రెండు దేశాల మధ్య యుద్ధం జరగొచ్చనే ఊహాగానాలు వచ్చిన సమయంలో నార్త్ కొరియా అధ్యక్షడు కిమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ కొరియాపై సైనిక చర్యలు ఏవీ కూడా చేపట్టరాదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా మిలిటరీ కమీషన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలియజేసింది.