మరోసారి మెరిసిన కిమ్

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి కనిపించారు. ఆ మధ్య కిమ్ కనబడకుండాపోయిన సంగతి తెలిసిందే. ఆయన భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. బతకడం కష్టమే అన్నారు. అసలు అధినేత ఆరోగ్యం విషయంపై ఆ దేశ మీడియా కూడా స్పందించలేదు. ఫైనల్ గా కిమ్ ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

అది జరిగిన మూడు వారాల తరువాత.. తిరిగి యాక్టివ్ అయినట్టున్నాడు. మొదటిసారి తన దేశ సైనికాధికారుల సమావేశంలో ప్రత్యక్షమయ్యాడు. నార్త్ కొరియా అణు సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలన్న విషయాన్ని చర్చించేందుకు వారితో భేటీ అయ్యాడు. సెవెంత్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఆఫ్ ది వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో తమ దేశం ఎల్లప్పుడూ ఎలా హై అలర్ట్ లో ఉండాలో కిమ్ బోధించాడు.