జనవరి 26న కిసాన్ ర్యాలీ

కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల రద్దు కోసం చేస్తున్న ఆందోళన 38వ రోజుకి చేరింది. ఇప్పటి వరకు రైతులతో ఆరు దఫాలుగా కేంద్రం జరిపిన చర్చలు ఫలించలేదు. ఈ నెల 4న మరోసారి రైతులతో కేంద్రం చర్చలు జరపనుంది. అయితే ఆ చర్చలు ఫలించకుంటే ఈ నెల 26న కిసాన్ ర్యాలీ నిర్వహిస్తామని రైతులు ప్రకటించారు.

జనవరి 26న ట్రాక్టర్లపై జాతీయ జెండాలతో ‘కిసాన్‌ పరేడ్’ పేరిట ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాల నాయకుడు దర్శన్‌ పాల్‌ తెలిపారు. అలాగే 23న ప్రతి రాష్ట్రంలో గవర్నర్ల నివాసాల వైపు ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ ఆందోళనలో 50 మంది రైతులు అమరులయ్యారని మరో నేత అశోక్‌ ధవాలే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 50 శాతం డిమాండ్లను అంగీకరించిందని వస్తున్న వార్తలు పూర్తి అవాస్తమని స్వరాజ్‌ ఇండియా చీఫ్‌ యోగేంద్ర యాదవ్‌ పేర్కొన్నారు.

Spread the love