గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం కిషన్‌ రెడ్డి ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందించి ప్రజల్లో నమ్మకం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌, కంటైన్మెంట్‌ జోన్ల విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. కరోనా కట్టడికి రాష్ట్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో కరోనా పరీక్షలను మరింత వేగవంతం చేయాలి. ఇప్పటివరకు తెలంగాణకు కేంద్రం 2.40 లక్షల పీపీఈ కిట్లను పంపించింది. ఇప్పటికే 800 వెంటిలేటర్లు రాగా, మరో 1,200 పంపించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. రెండు లక్షలకుపైగా ఆర్టీపీసీఆర్‌ టెస్టు కిట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయి. ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఏర్పాట్ల కోసం కేంద్రం రూ.200 కోట్లు ఇచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు.