తెలంగాణలో కుటుంబ పాలన పోవాలి !

తెలంగాణలో కుటుంబ పాలన పోవాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్ది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కిషన్ రెడ్డి మల్కాజిగిరి లో ప్రచారంలో పాల్గొన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు ఓటు వేస్తే డబుల్ బెడ్ రూమ్ ఇస్తామన్నారని.. ఇప్పటి వరకు ఒక్కరి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని ఫైర్‌ అయ్యారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరూ ఆలోచన చేసి ఓటు వేయాలని కోరారు. 4 నెలలలో కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకున్నాడు కానీ.. 6 ఏండ్లు అవుతున్న సామాన్య జనాలకు మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని మండిపడ్డారు. పొదుపు సంఘాలకు 20 లక్షల రుణాలు ఇప్పిస్తుంది మోడీ ప్రభుత్వం అని…. mmts తీసుకు వచ్చింది బీజేపీ ప్రభుత్వం అని తెలిపారు. ప్రభుత్వం వరద బాధితులకు 10 వేలు ఇస్తే వెనుక నుండి trs నాయకులు 5 వేలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు.

Spread the love