జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దాదాపు అన్నీ పార్టీలు జెడ్ స్పీడుతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయ్. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోల్నాక డివిజన్ భాజపా అభ్యర్థి కత్తుల సరితకు మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గోల్నాకలో పర్యటించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా ఓట్లు అడిగే హక్కు కేసీఆర్, కేటీఆర్కు లేదన్నారు.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు గోల్నాకలో ఇళ్ల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఐదేళ్లు పూర్తయినా ఒక్క ఇటుక కూడా వేయలేదు. ప్రజలు నిలదీస్తారనే భయంతోనే శిలాఫలకాన్ని తీసేశారు. ఇళ్లు ఎందుకు ఇవ్వలేదో ప్రచారానికి వచ్చే తెరాస నేతలను ప్రశ్నించాలి. గత ఎన్నికల్లో భాజపా నాలుగు స్థానాలే గెలిచింది. ఈ ఎన్నికల్లో భాజపాపై నగర ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని భాజపా కైవసం చేసుకుంటుందని ధీమా వక్తం చేశారు.