టిమ్స్ ని సందర్శించిన కిషన్ రెడ్డి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి గచ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో అందుతోన్న వైద్యం, వసుతలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కరోనా టెస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. టెస్టుల సంఖ్య ఎంత పెంచితే అంత మేరకు కరోనా మహమ్మారిని అరికట్టవచ్చన్నారు.

గచ్చిబౌలి టిమ్స్‌, ఎర్రగడ్డ ఆయుర్వేదిక్‌, గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నా. ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితుల కోసం పడకలు మరిన్ని పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తోంది. హైదరాబాద్‌లోని అన్ని బస్తీల్లో ప్రజలకు కరోనా పరీక్షలు చేయాలని కిషన్ రెడ్డి అన్నారు.