కోల్‌కతాతో మ్యాచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఐపీఎల్ 13 దాదాపు చివరి అంకంలోకి చేరుకుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలో 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ ముంగిట నిలిచాయి. తర్వాతి దశకు చేరడానికి ఆ జట్లకు మరొక్క విజయం చాలు. కానీ మిగిలిన ఒక్క బెర్త్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్ ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది.

ఈ నాలుగు జట్లు చివరి బెర్తు కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో అబుదాబి వేదికగా ఢిల్లీ కేపిటల్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ సమరానికి రంగానికి సిద్దమైంది ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: షుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రానా, మోర్గాన్ (సి), దినేష్ కార్తీక్(డబ్ల్యూ), సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్, లాకీ ఫెర్గూసన్, కమలేష్ నాగర్కోటి,, ప్రసీద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.

ఢిల్లీ కాపిటల్స్ జట్టు: అజింక్య రహానె, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ (సి), రిషబ్ పంత్ (ప), షిమ్రాన్ హెట్మియర్, మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, తుషార్ దేశ్‌పాండే