సీఎం కేసీఆర్’పై కోదండరామ్ ఫైర్

టీజేఎస్ అధినేత, ఫ్రొఫెసర్ కోదండరామ్‌ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.  అధికార పార్టీ నేతల మాట వినడం లేదనే.. కలెక్టర్లపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. కలెక్టర్ల క్షేత్రస్థాయి పర్యటనతో ప్రజా సమస్యలు బయటకొస్తున్నాయన్నారు. ప్రజా సమస్యలు బయటకు రావటం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు.

కలెక్టర్లకు మంచి పేరు రావటం కూడా ప్రభుత్వ పెద్దలకు రుచించడంలేదని కోదండరామ్ అన్నారు. అందుకే ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ సీరియస్ గా సూచనలు చేశారు. ఇంకా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చారన్నారు. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకే కలెక్టర్లు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.