కొత్త రెవెన్యూ చట్టంపై కోదండరాం కామెంట్

తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. తాజాగా ఈ బిల్లుపై ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెవ్‌సైట్‌లో లోపాలున్నాయన్నారు.

కొత్త రెవెన్యూ చట్టంతో పేద రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు. భూమి అమ్మకం, కొనుగోలుకు మాత్రమే కొత్త చట్టం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు దక్కాలనేదే తమ డిమాండని చెప్పారు. అవినీతి అంతానికి కర్ణాటక తరహా లోకాయుక్తాను తీసుకురావాలన్నారు.