‘నా మొత్తం ప్రపంచం ఒక్క ఫ్రేమ్‌లో ఉంది : కోహ్లీ

కోహ్లీ దంపతులు ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. అనుష్క శర్మ మరికొన్ని నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మన శరీరంలో మరో జీవితానికి ప్రాణం పోయడం అద్భుతమంటూ.. ఆనంద క్షణాల్ని ఆస్వాదిస్తున్నారు. పుట్టబోయే బిడ్డను ఊహిస్తూ మురిసిపోతున్నారు.

ఈ సందర్భంగా తీసిన ఓ అపురూపమైన ఫొటోను అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘నీలో మరో జీవితం ప్రాణం పోసుకోవడాన్ని ఆస్వాదించడానికంటే నిజమైంది, మధురమైంది మరొకటి ఉండదు. ఇది మన కంట్రోల్‌లో లేనప్పుడు ఇక ఏది ఉంటుంది..?’ అని పోస్ట్‌ చేశారు. దీనికి ఆమె ప్రియమైన భర్త విరాట్‌ కోహ్లీ అందమైన కామెంట్‌ చేశారు. ‘నా మొత్తం ప్రపంచం ఒక్క ఫ్రేమ్‌లో ఉంది’ అంటూ హార్ట్‌ సింబల్‌ పోస్ట్‌ చేశారు.