రస్మికకు బపర్ ఆఫర్

టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ రష్మిక మందన హవా చూపిస్తున్నారు. ఈ యేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకునారు. భీష్మతో మరో హిట్ కొట్టారు. ప్రస్తుతం సుకుమార్-అల్లు అర్జున్ హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’లో నటిస్తున్నారు.

మరోవైపు తమిళ సినీ పరిశ్రమలో కూడా రష్మికకు మంచి ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి, దీంతో అక్కడ కూడా సత్తా చాటుతానంటోంది రష్మిక. కోలీవుడ్ నుంచి తాజాగా రష్మికకు బంపర్ ఛాన్స్ వచ్చింది. అక్కడ తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించే చిత్రంలో రష్మిక నటించబోతోంది. నిజానికి విజయ్ `మాస్టర్` చిత్రంలోనే రష్మిక నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు కుదరలేదు. అయితే విజయ్ 65 వ సినిమా కోసం రస్మికని హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలిసింది.