భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుమార్తె శ్రీనిధి రెడ్డి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కర్నూలుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా ప్రతాప్ రెడ్డి కుమారుడికి ఆమెను ఇచ్చి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు.
ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి.. ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్స్ లో భువనగిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక తెలంగాణ పీసీసీ చీఫ్ కి పోటీ పడుతున్న నేతల్లో కోమట్ రెడ్డి ఒకరు. ఆయనకి పీసీసీ పదవి దక్కవచ్చని చెబుతున్నారు.
Spread the love