అఫిషియల్ : బీజేపీలోకి కోమట్ రెడ్ది

తెలంగాణ పీసీసీ పోస్ట్ కోసం కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి గట్టిగానే పోరాడుతున్నారు. రేవంత్ రెడ్డితో కలిసి ప్రధాన పోటీ దారుడిగా ఉన్నారు. అలాంటిది ఆయన సోదరుడు, ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈసందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మార్పు గురించి వివరించారు. భాజపా బలోపేతంపై గతంలో తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నా.. తాను మాత్రం భాజపాలో చేరేఅవకాశముందని తెలిపారు.

Spread the love