బీజేపీలో రాజగోపాల్ రెడ్డి.. క్లారిటీ ఇచ్చేశారు !

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమట్ రెడ్డి బ్రదర్స్ హవా కొనసాగేది. ఇప్పుడు కూడా వారి ప్రాధాన్యత కొనసాగుతోంది. అయితే మునుపటి రేంజ్ లో మాత్రం లేదు. గతంలో కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయ్. రాజగోపాల్ రెడ్డి కూడా భాజాపాలో చేరుతానన్నారు. కానీ ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నారు.

చౌటుప్పల్ లో తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీ అభ్యర్థిగా సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నానంటూ ఓ పత్రికలో వచ్చిన న్యూస్ చూసి ఆశ్చర్యపోయానన్నారు. గతంలో తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన మాట వాస్తవమేనని వ్యాఖ్యానించిన ఆయన, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ను వీడబోనని, మునుగోడు ప్రజల రుణం తీర్చుకోవడమే తన కర్తవ్యమని చెప్పుకొచ్చారు.

Spread the love