ఆప్ సీఎల్‌పీ నేతగా క్రీజీవాల్ ఏకగ్రీవం

ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ చీఫ్ అరవింద్ ఏకగ్రీవంగా కేజ్రీవాల్ ఎన్నికయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 70 స్థానాలకి గానూ ఆప్ 62 స్థానాని గెలిపొందింది. భాజాపా 8 స్థానాలకి పరితమైంది. ఆప్ ఘన విజయంతో ఢిల్లీ సీఎంగా క్రేజీవాల్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఈనెల 16న రామ్‌లీలా మైదానంలో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.కేజ్రీవాల్‌తో పాటు మొత్తం కేబినెట్ సభ్యులంతా రామ్‌లీలా గ్రౌండ్స్‌లో ప్రమాణస్వీకారం చేస్తారని, 16వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని ‘ఆప్’ సీనియర్ నేత మనీష్ సిసోడియా తెలిపారు.