కృష్ణా బోర్డు తరలించాలని ఏపీ లేఖ

ఆంధ్రప్రదేశ విభజన చట్టం ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏపీలో, గోదావరినది యాజమాన్య బోర్డు తెలంగాణలో ఉండాలని పేర్కొన్నారు. అందుకనుగుణంగా కృష్ణా బోర్డును రాష్ట్రానికి తరలించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. తాజాగా దీనికి సంబంధించి ఏపీ జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి .. బోర్డుకు లేఖ రాశారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న కృష్ణానది యాజమాన్య బోర్డును విశాఖకు తరలించాలని లేఖలో కోరారు. గతేడాది అక్టోబరు 6న జరిగిన అత్యున్నత మండలి భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బోర్డును తరలించాలని లేఖలో పేర్కొన్నారు. విశాఖలో బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు కోసం వసతి చూడాలని ఈఎన్సీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Spread the love