ఆ దమ్ము బీజేపీకి ఉందా ?

హైదరాబాద్‌ కోసం చేసిన ఒక్కపనినైనా చూపెట్టే దమ్ము బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ గ్రేటర్ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గ్రేటర్ అభివృద్ధి ప్రగతి నివేదికను కేటీఆర్ విడుదల చేశారు. 150 మంది అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ 150 డివిజన్లలో 85 డివిజన్లను మహిళలకే కేసీఆర్ కేటాయించారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించాం. 50 శాతం సీట్లు బీసీలకు కేటాయించాం. టికెట్లు రానివారిని అభ్యర్థులు కలుపుకొని పోవాలి. పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో హైదరాబాద్‌లో కొందరికి అపోహలుండేవి. ఈ ఆరేళ్లలో హైదరాబాద్‌లో ఎక్కడా చిన్న గొడవ కూడా జరగలేదు.

సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలిస్తున్నారు. ఇది అందరి హైదరాబాద్.. ఇది అందరి కోసం పనిచేసే ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పేకాట క్లబ్‌లు లేవు.. గుడుంబా వాసన లేదు. శాంతిభద్రతలు పటిష్టంగా ఉండబట్టే.. పెట్టుబడులు భారీగా వస్తున్నాయన్నారు.

Spread the love