వైరల్ : కేటీఆర్ కాటన్ మాస్కులు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేనేత కార్మికులని అండగా నిలుస్తున్నారు. చేనేతని ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సోమవారం ఆయన చేనేత దుస్తులని ధరిస్తున్నారు. అంతేకాదు. చేనేత కార్మికులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేటీయార్ చేనేత మాస్కులను ధరిస్తున్నారు. ఇవి ఎంతో అందంగా, డిజైన్లతో రూపొందాయి.

ప్రభుత్వం కూడా ప్రజలకు ఉచితంగా మాస్కులు అందించాలని భావిస్తోంది. చేనేత సంఘాల ద్వారా నాణ్యమయిన మాస్కులు తయారుచేయించి విక్రయిస్తే అటు కార్మికులకు.. ప్రజలకు మేలు చేకూరుతుంది. కేటీఆర్ ధరిస్తున్న కాటన్ మాస్కులు వివిధ రంగుల్లో ఆకట్టుకుంటున్నాయి. అవిసోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. కేటీఆర్ ని ఆదర్శంగా తీసుకొని పలువు కాటన్ మాస్క్ లని ధరిస్తున్నారు.