ఎన్నికల వేళ కామెడీ చూడండి.. ఎంజాయ్ చేయండి !

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ నేతల ఆరోపణలకి ధీటుగా సమాధానం చెబుతున్నారు. అంతేకాదు.. మాటల గారిడిలో తండి, సీఎం కేసీఆర్ ని తలపిస్తున్నారు. అంగట్లోకి కొత్త వేషగాళ్లొచ్చారని బీజేపీ నేతలని ఉద్దేశించి అంటున్నారు. వాటిని ప్రజలు ఎంజాయ్ చేయాలని సూచించారు. కొద్దిరోజులు మహిళలు టీవీలు బంద్ చేయండి.. బీజేపీ నేతల స్పీచ్ లు వినండి. మీకు బోలేడు వినోదం లభిస్తుందన్నారు.

రాష్ట్రంలో అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రతిపక్షాలు విన్యాసాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మాటల కంటే ఎక్కువగా చేతల ద్వారా తెరాస అభివృద్ధి చేసి చూపించిందన్నారు. సమస్యల పరిష్కారం కూడా తెరాస మాత్రమే చేయగలదని ధీమా వ్యక్తం చేశారు. సంఘాలు, కులాలు, వర్గాల పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Spread the love