వరద మృతులకి నష్టపరిహారం అందజేసిన కేటీఆర్

వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతూనే ఉంది. నాలుగో రోజు హైదరాబాద్‌ నగర శివారులోని అలీనగర్‌, గగన్‌పహాడ్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేశారు.

వరదల వల్ల ప్రాణ నష్టం జరగడం బాధాకరమని, ప్రాణనష్టం అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించిందని తెలిపారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అవసరమైన రేషన్‌, వైద్య సహాయం అందించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు మంత్రి కేటీఆర్. మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీలు రంజిత్‌రెడ్డి, అసదుద్దీన్‌ ఒవైసీ, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.