హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రయిక్స్.. కేటీఆర్ ఆగ్రహం !

తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసి.. టార్గెట్ గా మారుతున్నారు. ఇటీవల ట్రిపుల్ రైడిండ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయ్. తాజాగా హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని బండి సంజయ్ అన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ ఏంటి?! కొన్ని సీట్లు, ఓట్ల కోసం ఇంత దిగజారుతారా?. సహచర ఎంపీ విద్వేషపూరిత వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి సమర్థిస్తారా?’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు ఖండించలేదని కేటీఆర్‌ నిలదీశారు. పచ్చని హైదరాబాద్‌లో చిచ్చుపెడతారా? హైదరాబాద్‌ ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Spread the love