హైదరాబాద్‌ భద్రతపై కేటీఆర్‌ స్పెషల్‌

గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం అస్త్రశస్త్రాలని వెలుగులోనికి తీస్తోంది తెరాస. ప్రశాంతత ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజల భద్రత, రక్షణకు ప్రాధాన్యత ఇచ్చిందని వివరించారు. అందరి రక్షణ కోసం చర్యలు తీసుకున్నామని…అభద్రతకు బదులు భద్రతకు ఓటు వేయాలని ప్రజలకు విన్నవించారు.

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, షీ టీమ్స్‌, భరోసా కేంద్రం తదితర విషయాలతో కూడిన ఓ వీడియోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో గత ఆరు సంవత్సరాల్లో ఒక్క కర్ఫూ లేదని, 5లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మహిళల భద్రత కోసం షీటీమ్స్‌ ఏర్పాటు చేశామని వివరించారు.

Spread the love