ఐపీఎల్ : పూరమ్ పూనకం.. పంజబ్ విన్ !

ఐపీఎల్ లో పంజాయ్ హ్యాట్రిక్ కొట్టేసింది. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో గెలుపొందింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీనిర్ణీత 20 ఓవర్లలో దిల్లీ 164 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ బాదాడు. 12 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఢిల్లీ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులుండగానే విజయవంతంగా ఛేదించింది.

నికోలస్‌ పూరన్‌ (53; 28 బంతుల్లో 6×4, 3×6), మాక్స్‌వెల్‌ (32; 24 బంతుల్లో 3×4), క్రిస్‌గేల్‌ (29; 13 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. 56 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్‌.. ఆ తర్వాత తేరుకొని.. విజయం వైపుగా పయనించింది. 18 బంతుల్లో 14గా ఉండటం.. దీపక్‌ హుడా (15*; 22 బంతుల్లో 1×4), జేమ్స్‌ నీషమ్‌ (10*; 8 బంతుల్లో 1×6) పని పూర్తి చేశారు. ఈ విజయంతో పంజాబ్ 8 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది.