యదాద్రీశుడికి లక్ష పుష్పార్చన

మంగళవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష్మీనృసింహస్వామి స్వామి సన్నిధిలో లక్ష పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సహస్ర నామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిద రకాల పూలతో లక్ష పుష్పర్చన జరిపారు.

సుమారు రెండు గంటల పాటు పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ప్రతీ ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువు దీరిన యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం. కార్యక్రమంలో దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, వేద పండితులు, అర్చక బృందం, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

Spread the love