టీవీ నటి లీనా ఆచార్య కన్నుమూత

బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ టెలివిజన్ నటి లీనా ఆచార్య (30) కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూసారు. ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లీనా ఈరోజు తెల్లవారుజామున మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

రెండేళ్ళుగా ఈ వ్యాధితో బాధపడుతున్న లీనా.. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచింది. లీనా మృతిపై బాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇంత చిన్న వయస్సులో ఆమె మృతి చెందడంపై అభిమానులు, ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు.

Spread the love