లాక్ డౌన్ నష్టం.. 9లక్షల కోట్లు

దేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత ఈ నెల 31 వరకు మాత్రమే లాక్ డౌన్ ప్రకటించినా.. ఆ తర్వాత దాన్ని వచ్చే నెల 14 వరకు పొడిగించారు. దేశవ్యాప్తంగా మూడువారాలు లాక్ డౌన్ నిర్వహించడం వల్ల దేశ ఖాజానాపై రూ.9లక్షల కోట్ల భారం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇది దేశ జీడీపీలో 4శాతమని వారు చెప్తున్నారు. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో 2020-2021 ఆర్థిక సంవత్సరానికిగాను దేశ వృద్ధి రేటును 3.5శాతానికి తగ్గిస్తూ బార్క్ లే సంస్థ అంచనా వేసింది. ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను 1% తగ్గించే అవకాశం ఉందని బార్క్ లే అభిప్రాయపడింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4లక్షల 40వేల 386 మందికి కరోనా సోకింది. ఇందులో 19వేల 755 మంది మృతిచెందారు. 1లక్షా 12 వేల 36మంది కోలుకుంటున్నారు. ఇటలీలో ఎక్కువగా 6, 820 మంది మరణించగా, స్పెయిన్ 3, 434, చైనా 3, 281, ఇరాన్, 2,077, ఫ్రాన్స్ 1,100, అమెరికా 787, యూకే 433, నెదర్లాండ్స్ 356, జర్మని 181, బెల్జియం 178, స్విట్జర్లాండ్ 149, సౌత్ కొరియా 126, ఇండోనేషియా 58, బ్రెజిల్ 47, టర్కీ 44, జపాన్ లో 43 మంది మృతి చెందారు.