లాక్డౌన్ 5.0.. జూన్ 30 వరకు !

కరోనా కట్టడి కోసం దేశంలో విడతల వారీగా లాక్‌డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ 4.ఓ కొనసాగనుంది. ఆ తర్వాత కూడా లాక్‌డౌన్ పొడగిస్తారా ? లేదా మొత్తానికి ఎత్తేస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈలోగా హిమాచల్ ప్రదేశ్ లాక్‌డౌన్ 5.0ను ప్రకటించింది. ఇది వచ్చే నెల జూన్ నెలాఖరు వరకు కొనసాగుతుందని బీజేపీ నేతృత్వంలోని జైరాం ఠాకూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఈ లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 210 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 63 మంది కోలుకుంటే అయిదుగురు మరణించారు. ఒక్క హమరిపూర్ జిల్లాలోనే 63 కేసులు నమోదయ్యాయి. మరొక జిల్లా సోలన్‌లో 21 జిల్లాలు నమోదయ్యాయి.