బావిలోలో పడిన చిరుతపులి

చిరుత పులి వ్యవసాయ బావిలో పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ శివారులోని వ్యవసాయ బావిలో చిరుతపడింది. దీనిపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బావి వద్దకు చేరుకొని రెస్క్యూ టీం ద్వారా పులిని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక చిరుతను చూసేందుకు పెద్దసంఖ్యలో జనం బావి వద్దకు చేరుకున్నారు. చిరుతను సురక్షితంగా బయటకు తీసి అడవిలో విడిచిపెట్టాలని, అప్పుడే తాము ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నారు.

Spread the love