చినబాబు పెద్ద మాటలు

తెదేపా యువనేత నారా లోకేష్ ఇటీవల గట్టిగానే పోరాడుతున్నారు. పార్టీ నేతలకు అండగా నిలుస్తున్నారు. సుబ్బయ్య హత్య కేసుకుసంబంధించి గట్టిగా నిలబడ్డారు. ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులకు కారణం తెదేపానే అని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ని నారా లోకేష్ ఛాలెంజ్ చేశారు.

సింహాద్రి అప్పన్నపై ప్రమాణానికి తాను సిద్ధమని, జగన్ సిద్ధమా అని మళ్లీ జగన్‌కు లోకేష్ సవాల్ విసిరారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ఆలయాలపై దాడుల్లో టీడీపీ నేతల పాత్రపై చర్చకు సిద్ధమన్నారు. అంతేకాదు తేదీ సమయం చెప్పాలని లోకేశ్‌కు కౌంటర్‌ ఇచ్చారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన లోకేశ్‌… తాను జగన్‌రెడ్డికి సవాల్ విసిరితే వేరేవాళ్లు మొరగడం ఏంటని ట్వీట్ చేశారు.

Spread the love