సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో జాప్యంపై మండలి ఛైర్మన్ షరీఫ్ ఆగ్రహం

ఏపీకి మూడు రాజధానుల బిల్లుకి మండలిలో చిక్కెదురైన సంగతి తెలిసిందే. ఈ బిల్లుని సెలెక్ట్ కమిటీ కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు మండలి చైర్మన్ ఎంఎ షరీఫ్. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఏకంగా మండలిని రద్దు చేస్తూ.. తీర్మాణం చేసింది. ఆ తీర్మాణాన్ని కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఐతే, పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో జాప్యంపై ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్త్రాన్ని మండలి కార్యదర్శి తిరిగి పంపడంపై ఛైర్మన్ ఆగ్రహించారు. వెంటనే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసి నివేదించాలని మండలి కార్యదర్శికి ఆదేశించారు. ఇంకా జాప్యం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. మరీ ఇప్పటికైనా సెలక్టివ్ కమిటీ ఏర్పాటు చేస్తారా ? అన్నది చూడాలి.