‘మా` వనభోజనాలకు ఆయన రాలేదు..

కార్తీకమాసం లో అన్ని కులాల వారు వనభోజనాలకు వెళ్లడం చేస్తుంటారు..అందరూ సంతోషంగా ఓ చోట చేరి వంట చేసుకొని..భోజనాలు చేసి ఎంతో ఆహ్లాదంగా గడుపుతారు. తాజాగా సినీ స్టార్స్ కూడా ఈసారి వనభోజనాలకు వెళ్లారు. ఆదివారం హైటెక్ సిటీలోని ఫీనిక్స్ ఏరీనాలోని టిఎస్ ఐఐఐ పార్క్ లో వనభోజనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధాన కార్యదర్శి జీవితారాజశేఖర్.. ఉపాధ్యక్షుడు రాజశేఖర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.

`మా `మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా సైతం పాల్గొన్నారు. దాదాపు మాలో యాక్టివ్ గా ఉన్న వాళ్లంతా హాజరయ్యారు. అయితే `మా` అధ్యక్షుడు నరేష్ మాత్రం హాజరు కాలేదు. `మా`లో తలెత్తిన అంతర్గత విబేధాలు కారణంగా ఆయన హాజరు కాలేదని అంత మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.