లాక్‌డౌన్‌ పొడగించిన మహా సర్కార్

దేశంలో కరోనా విజృంభిస్తోంది. దేశంలో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఇప్పటివరకు 1,64,626 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 86,575మంది కోలుకోగా.. 7429 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించింది.

ఇందులో భాగంగా ‘మిషన్‌ బిగెన్‌ అగైన్‌’ పేరుతో మార్గదర్శకాలు విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 5493 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. దిల్లీ రెండో స్థానంలో ఉంది.