సుశాంత్ ఆత్మహత్యపై హోం మంత్రి ఏమన్నారంటే ?

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్యపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదు. ఆయనది ముమ్మాటికి హత్యేనని సుశాంత్ మామ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్య ఘటనపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

“సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఐతే వృత్తిపరమైన పోటీ వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముంబై పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తారు.” అని ఆయన అన్నారు.