ఈ నెల 13 నుంచి సంపూర్ణ లాక్ డౌన్

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే 7లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయ్. ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా నగరాల్లో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న పూణే, పింప్రి చిన్చ్వాడ్ ప్రాంతాల్లో కఠినమైన లాక్డౌన్ ను అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జులై 13 నుండి 23 వరకు 10రోజులు కఠినమైన లాక్ డౌన్ ను అమలు చేస్తునట్టు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో అత్యవసర సేవలు తప్ప మిగిలిన సేవలన్నీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.

Spread the love