మహేష్ బాబు .. మైండ్ బ్లాంక్


సూపర్ స్టార్ మహేష్ బాబు-మాస్ డైరక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా పాటల పండుగ స్టార్ట్ అయింది. ప్రతి సోమవారం ఓ సాంగ్ అని ప్రకటించినట్లుగానే తొలిసాంగ్ వచ్చేసింది.

‘మైండ్ బ్లాంక్..మైండ్ బ్లాంక్’ అంటూ సాగిన అచ్చమైన దేవీశ్రీప్రసాద్ స్టయిల్ పాటను బయటకు వదిలారు. నువ్వు కొట్టరా..నువ్వు ఊదరా,,నువ్వు వాయించరా..ఇలా మూడు నాలుగు డైలాగులు ఫన్నీగా మహేష్ గొంతుతో వినిపించారు. ‘ఎపుడూ ప్యాంటేసే వాడు లుంగీ కట్టాడు…అంటూ ఓ దేశీ మాస్ లుక్ ను వర్ణిస్తూ పాటను స్టార్ట్ చేసారు. ఈ పాటను మీరూ వినండి.