రవితేజ కోసం మలయాళ బ్యూటీ

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమాలో నటిస్తున్నారు. బలుపు కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రమిది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ-శృతిహాసన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘రాక్షసుడు’ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నారు.

ఈ సినిమా కోసం హీరోయిన్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ అనుకున్నారు దర్శాకనిర్మాతలు. ఆమె ఇంకా ఎస్ కానీ, నో గానీ చెప్పలేదని తెలుస్తోంది. రజనీకాంత్ ‘పేట’ సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ మాళవిక ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలో చేస్తుంది.