షోయబ్ మాలిక్ టీ20 రికార్డ్

పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ టీ20 రికార్డ్ కొట్టారు. టీ20ల్లో 10 వేల పరుగుల సాధించిన మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నిన్న రావల్పిండిలో జరిగిన దేశవాళీ లీగ్ నేషనల్ టీ20లో 74 పరుగులు చేసిన షోయబ్ ఈ ఘనత సాధించాడు.

ఈ జాబితాలో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ 13,296 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కీరన్ పొలార్డ్ (10,370) ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 2005లో టీ20ల్లో అడుగుపెట్టిన షోయబ్ ఇప్పటి వరకు 395 మ్యాచ్‌లు ఆడి 10,027 పరుగులు చేశాడు. అలాగే, 148 వికెట్లు తీశాడు.