ఐపీఎల్ నుంచి మలింగ్ అవుట్

ముంబై ఇండియన్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్‌ లసిత్‌ మలింగ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. మలింగ తండ్రి తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం. మలింగ స్థానంలో ఆస్ట్రేలియా పేసర్‌ జేమ్స్‌ పాటిన్సన్‌ను ముంబై జట్టులోకి తీసుకున్నారు. ఈ వారాంతంలో అబుదాబిలోని ముంబై జట్టుతో పాటిన్సన్‌ టీమ్‌తో చేరనున్నాడు.

మలింగ దూరమవడం ముంబై జట్టు బౌలింగ్‌పై ప్రభావం చూపనుంది. స్లాగ్ ఓవర్లలో బౌలింగ్  చేయడంలో మలింగ సిద్ధహస్తుడు. గత యేడాది ఫైనల్ లో చెన్నైపై ముంబై విజయంలో మలింగ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.